News March 14, 2025
యాదాద్రి: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

యాదాద్రిలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI
Similar News
News December 3, 2025
తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.
News December 3, 2025
మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
News December 3, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్


