News January 25, 2025
యాదాద్రి భువనగిరి: గ్రామ సభలకు 74,614 దరఖాస్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు రోజులగా నిర్వహిస్తున్న గ్రామసభలు నేటితో ముగిసాయి. జిల్లాలో గ్రామసభల ద్వారా 74,614 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసా 2698 దరఖాస్తులు, రేషన్ కార్డులు కొరకు 28,049 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 32,316 దరఖాస్తులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 11,551 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News November 26, 2025
ఇండోనేషియాలో తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సెన్యార్’ తుఫాన్ ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో బీభత్సం సృష్టిస్తోంది. అతిభారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 8 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇవాళ రాత్రికి తుఫాన్ తీరం దాటనున్నట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు భారత్లోని తమిళనాడు, కేరళ, అండమాన్ & నికోబార్పై సెన్యార్ ప్రభావం చూపుతోంది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
News November 26, 2025
పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

శుభకార్యాలు ప్రారంభించే ముందు పెరుగు, చక్కెర కలిపి తింటారు. ఇలా తింటే అదృష్టం వరిస్తుందన్న నమ్ముతారు. అయితే దీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉంది. ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు, ఫస్ట్ డే ఆఫీస్కు వెళ్లినప్పుడు ఎవరికైనా ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. అయితే పెరుగుకు దేహాన్ని చల్లబరచే సామర్థ్యం, చక్కెరకు తక్షణ శక్తి అందించే లక్షణాలు ఉంటాయి. ఈ మిశ్రమం తీసుకుంటే టెన్షన్ తగ్గి, మనసు శాంతిస్తుంది. అందుకే తినమంటారు.
News November 26, 2025
ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేశారా?

ఏపీ గ్రామీణ బ్యాంకులో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్కు రూ.30వేల చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://apgb.bank.in/


