News February 24, 2025
యాదాద్రి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News February 24, 2025
నిజామాబాద్: నరేందర్ రెడ్డిని గెలిపించండి: ముఖ్యమంత్రి

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి మండలిలో పట్టభద్రుల సమస్యలపై గొంతుకను వినిపిస్తారని అన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యల వాణికి వినిపిస్తారని పేర్కొన్నారు.
News February 24, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఉద్యోగులకు ప్రత్యేకసెలవు: కలెక్టర్

ఈనెల 27న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ అథారిటీల్లో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటుహక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులకు సైతం ఓటుహక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలన్నారు.
News February 24, 2025
గ్యాస్ పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు: జేసీ

దీపం పథకం కింద సరఫరా చేస్తే గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి హెచ్చరించారు. కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే విచారణ నిర్వహిస్తామన్నారు.