News February 24, 2025
యాదాద్రి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News March 19, 2025
స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఒక ఇంట్లో జోడు పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. స్టే.ఘ మండల పార్టీ అధ్యక్షుడిగా జూలుకుంట్ల శిరీశ్ రెడ్డి ఉండగా.. అతని భార్య లావణ్యకు మార్కెట్ ఛైర్మన్ పదవిని, అంతేకాకుండా లింగాల ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడికి జనగామ మార్కెట్ వైస్ ఛైర్మన్ పదవి, జఫర్గడ్ మండల పార్టీ అధ్యక్షుడికి స్టే.ఘ. మార్కెట్ వైస్ ఛైర్మన్ పదవిని ఎమ్మెల్యే కట్టబెట్టారు.
News March 19, 2025
సంగారెడ్డి: నేడు జిల్లా వ్యాప్తంగా సంబరాలు: నిర్మల రెడ్డి

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినందుకు జిల్లా వ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలని TGIIC ఛైర్ పర్సన్ డీసీసీ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి మంగళవారం తెలిపారు. మూడు దశాబ్దాల వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని చెప్పారు .ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో పాల్గొనాలని కోరారు.
News March 19, 2025
మహిళల భద్రతకు భరోసా శక్తి మొబైల్ యాప్: డీఎస్పీ

మహిళల భద్రతకు భరోసాగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి (ఎస్‌వోఎస్) మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, యువత తమ మొబైల్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ మొబైల్ ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో పోలీసుల సహాయంతో పాటు సులువుగా రక్షణ పొందవచ్చునన్నారు.