News October 8, 2024

యాదాద్రి: రూ.10,65,000తో అమ్మవారి అలంకరణ

image

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో అమ్మవారిని రూ.10,65,000తో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Similar News

News December 6, 2025

NLG: 3,035 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7,494 పోలింగ్ స్టేషన్లో ఉంటే.. 3,035 సమస్యాత్మక పోలింగ్ స్టేషనులను పోలీసులు గుర్తించారు. ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఐదు నుంచి 6 మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. గ్రామాల్లో గొడవలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ప్రతి మండలంలో నలుగురు ఎస్ఐలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News December 6, 2025

NLG: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు 30% దాటేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. కుల ధ్రువపత్రాలు తహశీల్దార్లు జాప్యం చేయకుండా ఇవ్వాలని, బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.