News March 24, 2025
యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.
Similar News
News March 30, 2025
పన్నులపై 50% వడ్డీ రాయితీ పొందండి: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గుడ్న్యూస్ చెప్పారు. పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చినట్లు ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 31వ తేదీ లోగా బకాయిలు చెల్లించి ఈ లబ్ధి పొందాలని సూచించారు.
News March 30, 2025
బాపట్ల కలెక్టరేట్లో ఘనంగా ఉగాది వేడుకలు

బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఉగాది వేడుకలను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 30, 2025
ప్రశాంతంగా కొనసాగుతున్న ఫకీర్ షావలి జాతర

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఫకీర్ షా వలి జాతర ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. హిందూ, ముస్లింలు సంయుక్తంగా జరుపుకొంటున్న ఈ జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎల్కతుర్తి ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.