News February 19, 2025

యాదాద్రి: రేపు ఛలో విద్యుత్ సౌదాకు పిలుపు

image

తమను కన్వర్షన్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు రేపు ఛలో విద్యుత్ సౌధాకు పిలుపునిచ్చారు. TVAC-JAC ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్టిజన్లు డిమాండ్ చేస్తున్నారు. విద్యా అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేపటి ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

Similar News

News March 24, 2025

5 స్టార్ ఏసీ వాడితే.. 60 శాతం కరెంట్ ఆదా

image

5 స్టార్ రేటెడ్ ACలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) సౌత్ఇండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో వాడుతున్న ACల్లో అత్యధికం 8ఏళ్ల కంటే పాతవని, ఇవి 40-50% విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెప్పాయన్నారు. ACని 24°C వద్ద వాడటం ఉత్తమమన్నారు. 5స్టార్ రేటెడ్ ACలతో భూతాపాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ హౌజ్ గ్యాసెస్‌ని అరికట్టవచ్చని తెలిపారు.

News March 24, 2025

విశాఖలో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి.. కేసు నమోదు

image

సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యజమానిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆక్సిజన్ టవర్స్‌లో నివాసం ఉంటున్న ప్రసాద్ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయగా మర్యాదగా పిలవలేదని దాడి చేసి బట్టలు విప్పి బయటకు పంపించేశారు. వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News March 24, 2025

పాల్వంచ: అమ్మకు ప్రేమతో..❤️

image

పాల్వంచకు చెందిన లక్ష్మి అనే మహిళ ప్రమాదవశాత్తు కిందపడి కోమాలోకి వెళ్లింది. అయితే ఆమె బతకడం కష్టమే అని వైద్యులు చెప్పడంతో ఆమె కొడుకు శరత్ నిపుణులను పిలిపించి మెటల్‌తో తల్లి పాదాలను చేయించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడు. ఆ పాదాలకు లక్ష్మి పట్టీలు, మెట్టెలు అమర్చాడు. కాగా తల్లి మృతి చెందగా.. ఆదివారం లక్ష్మి దశదిశ కర్మ నిర్వహించారు. మెటల్ పాదాలతో పాటు ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఆసక్తిగా చూశారు.

error: Content is protected !!