News February 6, 2025
యాదాద్రి: రైతు భరోసా నిధులు జమ

భువనగిరి జిల్లాలో ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమాయ్యాయి. యాదాద్రి జిల్లాలో మొత్తం 78,795 మంది రైతులకు గాను రూ.46,44,93,195 రూపాయల రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమయ్యాయి. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేలు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఒక ఎకరాకు 6000 రూపాయలను జమ చేస్తోంది.
Similar News
News April 14, 2026
BREAKING.. సంగారెడ్డి: పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి

సంగారెడ్డి జిల్లాలో పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతిచెందాడు. మనూర్ పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి వాహనం ఏఎస్ఐ పైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. డ్రైవర్ రామారావు పరారీలో ఉండగా, కక్షపూరితంగానే ఇలా చేశాడని ఏఎస్ఐ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 14, 2026
HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.
News April 14, 2026
SRCL: ‘ఆస్పత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత మూడు నెలల్లో ఔట్ పేషెంట్ లు 60,579 మంది, ఇన్ పేషెంట్ 3,939 మంది నమోదయ్యారని వైద్యులు కలెక్టర్‌కు తెలిపారు. జనవరి నుంచి మేజర్ ఆపరేషన్లు 365, మైనర్ ఆపరేషన్లు 993 చేశామని వెల్లడించారు.


