News March 11, 2025

యాదాద్రి: రోడ్డు పక్కన ఆడ శిశువు మృతదేహం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. యాదగిరిపల్లిలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు ప్రక్కన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 4, 2025

APCRDA “గ్రీవెన్స్ డే” నిర్వహణలో స్వల్ప మార్పు

image

అమరావతిలో తుళ్లూరు CRDA కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న గ్రీవెన్స్ డే.. ఇకపై ప్రతి శనివారం రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుందని CRDA అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రతి శనివారం – రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

సంగారెడ్డి: ‘మూడుసార్లు లెక్కలు చూపించాలి’

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడుసార్లు తమ లెక్కలను వ్యయ అధికారులకు చూపించాలని జిల్లా పరిశీలకులు రాకేష్ గురువారం తెలిపారు. 8, 10, 12 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయంలో వ్యాయ పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. వ్యాయ పరిశీల చేసుకొని అభ్యర్థులకు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.