News March 15, 2025
యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి (UPDATE)

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద <<15765722>>రోడ్డుప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (34) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 25, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR(D)కు చెందిన నవవధువు మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్‌కు 4 నెలల క్రితం SDPTకు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ HYDలో ఉద్యోగం చేస్తున్నారు. SDPTలో ఓ ఫంక్షన్‌కు హజరైన దంపతులు నిన్న బైకుపై HYD వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు.
News November 25, 2025
సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.
News November 25, 2025
తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.


