News March 17, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,600 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.1,30,000లు, ప్రసాద విక్రయాలు రూ.18,42,320, VIP దర్శనాలు రూ.7,65,000, బ్రేక్ దర్శనాలు రూ.4,05,600, కార్ పార్కింగ్ రూ.6,37,000, యాదరుషి నిలయం రూ.2,34,911, లీజెస్ రూ.19,20,572, అర్చనలు రూ.1,09,316 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.68,33,880 ఆదాయం వచ్చింది.
Similar News
News April 23, 2025
10th RESULTS: హ్యాట్రిక్ కొట్టిన పార్వతీపురం మన్యం జిల్లా

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలించింది.
➤ 2022-23 విద్యా సంవత్సరంలో 10,694 మంది పరీక్ష రాయగా 9,356(87.4%) మంది పాసయ్యారు
➤ 2023-24 విద్యా సంవత్సంలో 10,443 మంది పరీక్షకు హాజరవ్వగా 10,064(96.37%) మంది ఉత్తీర్ణత సాధించారు
➤ ఈఏడాది(2024-25) 10,286 మంది పరీక్ష రాయగా 9,659 (93.90%) మంది పాసయ్యారు.
News April 23, 2025
టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla
News April 23, 2025
టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.