News March 24, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా వీటి ద్వారా రూ.1,03,200, ప్రసాద విక్రయాలు రూ.19,04,650, VIP దర్శనాలు రూ.8,10,000, బ్రేక్ దర్శనాలు రూ.3,78,900, కార్ పార్కింగ్ రూ.7,04,500, యాదరుషి నిలయం రూ.1,92,054, ప్రధాన బుకింగ్ రూ.2,55,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,28,666 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News November 7, 2025
KMR: ఇన్ఛార్జ్ DMHOగా డా.విద్య

కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.విద్య నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.రవీందర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తించిన డా.చంద్రశేఖర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వికారాబాద్ RMOగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో డా.విద్యను నిమయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 7, 2025
తిరుపతి, చిత్తూరులో పవన్ పర్యటన ఇలా..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ఉదయం 10 గంటలకు రేణిగుంటకు వస్తారు. మామండూరు అటవీ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేసి అదేరోజు రాత్రి విజయవాడ వెళ్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి పలమనేరు(ముసలిమడుగు) కుంకి ఏనుగుల క్యాంప్నకు చేరుకుంటారు.
News November 7, 2025
WGL: రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గుతూ కంటతడి పెట్టిస్తున్నాయి. క్వింటా పత్తి ధర సోమవారం రూ.6,920, మంగళవారం రూ.6,950, గురువారం రూ.6,900 పలికాయి. నేడు మరింత పతనమై రూ.6,860కి చేరింది. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.


