News January 28, 2025
యాదాద్రి శ్రీవారికి రూ.1,11,116/- విరాళం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్.వేణుగోపాల్ రావు రూ.1,11,116 చెక్కును విరాళంగా మంగళవారం ఆలయ ఏఈఓ రమేశ్‌కు అందజేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Similar News
News February 19, 2025
జాక్‌పాట్ కొట్టిన రేఖా గుప్తా

ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) MLA రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ముఖ్యమంత్రి పదవి వరించడం విశేషం. రేఖ అనూహ్యంగా సీఎం అభ్యర్థి రేసులోకి వచ్చారు. పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ వంటి హేమాహేమీలను కాదని హైకమాండ్ ఆమె వైపే మొగ్గు చూపింది. అలాగే దేశంలోని NDA పాలిత రాష్ట్రాల్లో ఈమె ఒక్కరే మహిళా సీఎం కావడం విశేషం.
News February 19, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

☞ ఈనెల 23న యాదాద్రికి సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన ☞ చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం ☞ భువనగిరిలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన ☞ సుందరంగా ముస్తాబైన యాదాద్రి క్షేత్రం ☞ భువనగిరి కలెక్టర్‌కు ఇన్విటేషన్ ☞ HYD బోడుప్పల్‌లో విగ్రహ ప్రతిష్ఠలో కోమటిరెడ్డి, బీర్ల☞ గుండాలలో నీటి ఎద్దడి
News February 19, 2025
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అద్దంకి మండలం వేణుగోపాలపురం సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. కట్టెల ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ఏనికపాటి ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది అతన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.