News March 5, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. 700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.35,000, ప్రసాద విక్రయాలు రూ.6,73,650, VIP దర్శనాలు రూ.1,50,000, బ్రేక్ దర్శనాలు రూ.91,500, ప్రధాన బుకింగ్ రూ.31,112, కార్ పార్కింగ్ రూ.1,26,500, వ్రతాలు రూ.40,800, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.13,21,685 ఆదాయం వచ్చింది.

Similar News

News December 29, 2025

రైతులు తప్పక పూజించాల్సిన దేవత

image

ప్రకృతిని భూదేవిగా ఆరాధించడం మన సంస్కృతి. శ్రీ మహావిష్ణువు వరాహ రూపమెత్తినప్పుడు ఆయన శక్తిగా వారాహీ దేవి ఆవిర్భవించింది. ఈమెను సాక్షాత్తు మహాలక్ష్మిగా, లలితా దేవి సైన్యాధ్యక్షురాలిగా పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధిస్తే పంటలు బాగా పండుతాయని పండితులు చెబుతున్నారు. భూ తగాదాలు తొలగి, సంపదలు సిద్ధిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం ఆరంభించే రైతులు ఈమెను పూజించడం వల్ల ఆ పనులలో విజయం లభిస్తుందని నమ్మకం.

News December 29, 2025

డార్క్ సర్కిల్స్‌ని ఇలా తగ్గించేద్దాం

image

నిద్రలేమి, ఒత్తిడి, గ్యాడ్జెట్స్‌ ఎక్కువగా వాడటం వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి ఈ హోం రెమెడీస్.* కీర‌దోస ముక్క‌ల‌ను క‌ళ్ల‌పై అర‌గంట పాటు ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి. * కాట‌న్ ప్యాడ్‌ను రోజ్ వాట‌ర్‌లో ముంచి క‌ళ్ల‌పై 20నిమిషాలు ఉంచాలి. * గ్రీన్‌టీ బ్యాగులను ఫ్రిజ్‌లో ఉంచి కళ్లపై ఉంచుకోవాలి. * ఆలూని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత ముక్క‌లు చేసి కళ్లపై పెట్టుకోవాలి.

News December 29, 2025

ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు

image

AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు(నేచురోపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయనతో పాటు పోచంపల్లి శ్రీధర్ రావు(మాస్ కమ్యూనికేషన్)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.