News March 14, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 620మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.31,000, ప్రసాద విక్రయాలు రూ.6,13,290, VIP దర్శనాలు రూ.1,50,000, బ్రేక్ దర్శనాలు రూ.1,05,900, కార్ పార్కింగ్ రూ.1,70,500, ప్రధాన బుకింగ్ రూ.80,450, సువర్ణ పుష్పార్చన రూ.46,800, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.30,58,258 ఆదాయం వచ్చింది.
Similar News
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.
News February 9, 2026
KNR: ఎన్నికల నిఘా ‘ముమ్మరం’.. సరిహద్దుల్లో తనిఖీలు!

ప్రలోభాలను అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీని కఠినతరం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 28 వరకు జిల్లాలోపోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.
News February 9, 2026
బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.


