News March 15, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 1,080 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.54,000, ప్రసాద విక్రయాలు రూ.11,78,890, VIP దర్శనాలు రూ.4,50,000, బ్రేక్ దర్శనాలు రూ.3,06,900, కార్ పార్కింగ్ రూ.4,20,870, యాదరుషి నిలయం రూ.64,160, సువర్ణ పుష్పార్చన రూ.92,316, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.29,93,218 ఆదాయం వచ్చింది.
Similar News
News December 5, 2025
NRPT: వైద్య శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, సిబ్బంది వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో ఎన్సీడీ ప్రోగ్రాంపై సమీక్షించారు. వైద్య శాఖ పరిధిలోని కార్యక్రమాలను, టీకాలు, మందుల పంపిణీ వంటి వాటిని వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
News December 5, 2025
అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.
News December 5, 2025
CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీలకం కానుందని INC పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగమయ్యే వారికి సమ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.


