News March 15, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 1,080 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.54,000, ప్రసాద విక్రయాలు రూ.11,78,890, VIP దర్శనాలు రూ.4,50,000, బ్రేక్ దర్శనాలు రూ.3,06,900, కార్ పార్కింగ్ రూ.4,20,870, యాదరుషి నిలయం రూ.64,160, సువర్ణ పుష్పార్చన రూ.92,316, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.29,93,218 ఆదాయం వచ్చింది.

Similar News

News February 8, 2026

WGL: అన్నా.. ఏమైందే నా ఓటు నీ వార్డులోనే ఉంది!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. కొందరు ఓటర్లు తమ ఓటు అదే వార్డులో ఉందని చెబుతూ మద్యం, డబ్బులు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బయట ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఫోన్ చేసి రవాణా ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు భారంగా మారగా, ఎన్నికల వేళ ఓటు వ్యాపారం చర్చనీయాంశంగా మారింది.

News February 8, 2026

గందరగోళంలో ఉన్నారా? ఈ ప్రాచీన ట్రిక్ ట్రై చేయండి!

image

ఇతరుల సమస్యలకు గొప్ప సలహాలు ఇచ్చే మనం.. మన విషయంలో మాత్రం తడబడతాం. దీన్నే ‘సోలమన్ పారడాక్స్’ అంటారు. దీనికి చెక్ పెట్టేదే ‘ఇల్లీయిజం’. అంటే మీ గురించి మీరు ‘నేను’ అనకుండా మీ పేరుతో మాట్లాడుకోవడం. Ex ‘నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’ అని కాకుండా ‘రాజు (మీ పేరు) ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి?’ అని ఆలోచించడం. ఇలా చేస్తే ఎమోషన్స్ పక్కకు జరిగి తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

News February 8, 2026

కరీంనగర్: జోరుగా మద్యం పంపిణీ.. విందు రాజకీయాలు షురూ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో విందు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వార్డులలో వాడవాడనా కార్యకర్తల నుంచి మొదలు లీడర్ల వరకు గ్రూపులు విభజించి విందు ఇస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి మద్యం బాటిల్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి ఈ తంతు నడుస్తున్నప్పటికీ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత జోరు అందుకుంది.