News March 19, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.2,07,244, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,57,200, ప్రసాద విక్రయాలు రూ.8,77,450, కళ్యాణకట్ట రూ.40,000, అన్నదాన విరాళాలు రూ.43,609 సువర్ణ పుష్పార్చన రూ.52,916 కార్ పార్కింగ్ రూ.2,06,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,14,642 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

Similar News

News November 23, 2025

అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

News November 23, 2025

చిలకపాలెం-రాయగడ రోడ్డు పనులకు రేపు శంకుస్థాపన

image

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో బేబినాయన కోరడంతో రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. గొర్లెసీతారాంపురం వద్ద శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 23, 2025

ఈ నెల 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

ఈ నెల 28న రాజధాని అమరావతిలో పలు బ్యాంక్‌ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు చేసింది. శంకుస్థాపన అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర సభకు నిర్మలా సీతారామన్‌, పెమ్మసాని, చంద్రబాబు, పవన్‌ హాజరు కానున్నారు.