News March 10, 2025
యాదాద్రి శ్రీవారి రథోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మధుర ఘట్టమైన దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతురావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రముఖ సినీ గాయకురాలు గీతా మాధురి భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఛైర్మన్ నరసింహమూర్తి దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2026
60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలి: జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తూ, పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
News January 22, 2026
కొత్త GHMC కమిషనర్ కార్యాలయాలు ఇక్కడే!

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్‌లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.
News January 22, 2026
ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూ సౌత్ వేల్స్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిడ్నీకి సుమారు 611KM దూరంలో ఉన్న లేక్ కార్గెల్లిగోలో కాల్పులు జరిగాయి. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోయినేడాది DEC 14న బాండీ బీచ్‌లో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో 10 కంటే ఎక్కువ మంది బలయ్యారు.


