News February 16, 2025
యాదాద్రి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళాయే!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. 1న విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభం కాగా 2న ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 3 నుంచి అలంకరణ సేవలు, 7న స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం, 8న తిరు కళ్యాణ మహోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న చక్ర తీర్థం, 11న శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Similar News
News March 19, 2025
సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 79 కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని సూచించారు.
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.
News March 19, 2025
బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.