News February 16, 2025

యాదాద్రి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళాయే!

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. 1న విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభం కాగా 2న ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 3 నుంచి అలంకరణ సేవలు, 7న స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం, 8న తిరు కళ్యాణ మహోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న చక్ర తీర్థం, 11న శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి.

Similar News

News March 17, 2026

విజయనగరంలో నేడు జాబ్ మేళా

image

విజయనగరంలోని మహారాజా కాలేజ్‌లో ఈ నెల 17 ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్, కెమిస్టు, అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి సుమారు 250 ఖాళీలు భర్తీ చేయనున్నాయని, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులన్నారు. అభ్యర్థులకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్డు తప్పనిసరి అని సూచించారు.

News March 17, 2026

MHBD: ఈత సరదా.. విషాదం కావొద్దు!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుంచి పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వేళ విద్యార్థులకు సెలవు ఉండటంతో వారు సరదా కోసం చెరువులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉందని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు వాహనాలు నడపడం వంటి సాహసాలు చేయకుండా చూడాలని, ఈత సరదా కుటుంబాలకు కడుపుకోత మిగల్చకుండా తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 17, 2026

BIG ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. TGలో నేటి నుంచి 23వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, HYD, మేడ్చల్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అటు APలో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.