News February 5, 2025

యాదాద్రి: సదరం క్యాంపు తేదీలు ఇవే..

image

భువనగిరి జిల్లాలో సదరం సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇదివరకే కొత్త వాటి కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి టి.నాగిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సదరం క్యాంపులకు హాజరుకావాలని కోరారు. 

Similar News

News December 13, 2025

ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

image

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News December 13, 2025

Way2News కథనానికి స్పందించిన సీతక్క

image

ఏటూరునాగారంలోని రామన్నగూడెం రోడ్డు 7వ వార్డులో వైన్ షాపు ఇళ్ల మధ్య ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం <<18545026>>’మానాభిమానాల కంటే వైన్ షాపు ముఖ్యమా..?’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురించగా మంత్రి సీతక్క స్పందించారు. నివాసాల మధ్య వైన్ షాపును ఏర్పాటు చేయొద్దని ఎక్సైజ్ శాఖకు సూచించారు. దీంతో స్థానికులు, సీతక్కకు, Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 13, 2025

పల్నాడు: ‘ఓవర్ లోడ్‌లు అరికట్టేందుకు చర్యలు’

image

పల్నాడు జిల్లాలో ఓవర్ లోడ్‌లు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఇసుక టిప్పర్లతో పాటు భారీ వాహనాలకు సంబంధించి రూ. 20 వేల వరకు జరిమానాలు ఓవర్ లోడ్‌కు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యేకంగా ఇసుక వాహనాలకు సంబంధించి 35కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. పరిమితికి మించి వెళ్లే ప్రతి వాహనంపై నిఘా ఉంటుందని, నిబంధనలు పాటించాలన్నారు.