News March 21, 2025
యాదాద్రి: 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువ కెరటం!

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు ఏలే నరసింహ-పారిజాతల కుమారుడు ఏలే సుభాష్ చంద్రబోస్ చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. పురావస్తు శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ అసిస్టెంట్, గ్రూప్-4 మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల SSC-CGLలో మంచి ర్యాంక్ సాధించి కేంద్ర రక్షణ శాఖలో ఆడిటర్ ఉద్యోగమూ దక్కించుకున్నాడు.
Similar News
News April 4, 2025
జనగామ మార్కెట్ యార్డ్ 3 రోజులు బంద్

జనగామలోని మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన కారణంగా యార్డ్‌లో స్థలం లేదన్నారు. దీంతో శుక్రవారం సెలవు ప్రకటించారు. శనివారం జగ్జీవన్ జయంతి, ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. సోమవారం తిరిగి పున:ప్రారంభం ప్రారంభమవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.
News April 4, 2025
నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
News April 4, 2025
పెండింగ్ పనులు పూర్తి చేయాలి: జనగాం కలెక్టర్

ఏప్రిల్ 12లోగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో UDID కార్డులు, శాశ్వత మరణాల ఆసరా పెన్షన్ ధృవీకరణ, SHG బీమా, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ఉపాధి పనులు, LRS విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఉన్నారు.