News March 23, 2025
యానాం సబ్ జైలు గోడదూకి పరారైన ఖైదీ

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైల్ నుంచి గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. సుమారు 25 అడుగులు సబ్ జైల్ గోడ పైనుంచి దూకి శనివారం పరారైనట్లు సమాచారం. ఒక దొంగతనం కేసులో శనివారం ఉదయం 7 రోజులు రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్లిన కనకాల పేటకు చెందిన కనకాల వెంకటేశ్వర్లు మధ్యాహ్నానికి పరారయ్యాడని చెబుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News October 30, 2025
దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.
News October 30, 2025
కామారెడ్డి: ఉజ్వల కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాలు, గ్యాస్ కనెక్షన్ లేనివారు మాత్రమే అర్హులన్నారు. అర్హత గల లబ్ధిదారులు వెంటనే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు.
News October 30, 2025
అక్టోబర్ 30: చరిత్రలో ఈరోజు

1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి మరణం
1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం (ఫొటోలో)
1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశంగా చేరింది
1987: సినీ దర్శకుడు రాజాచంద్ర మరణం
1990: దర్శకుడు, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
✒ ప్రపంచ పొదుపు దినోత్సవం


