News March 19, 2025

యాపల్‌గూడ యువకుడికి సెకండ్ ర్యాంక్

image

యాపగూడ గ్రామానికి చెందిన పరమాదాస్, రుక్మాబాయి దంపతుల కుమారుడు ఎ.చంద్రశేఖర్ TSPSC నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలో ఉత్తమ ప్రతిభచాటాడు. బీసీ వెల్ఫేర్ విభాగంలో, బాసర జోన్‌లో సెకండ్ ర్యాంక్ సాధించాడు. ఆదిలాబాద్ పట్టణంలోని, ప్రైవేట్ B.Ed కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రిపేర్ అయ్యాడు. తమ గ్రామ యువకుడు ఉద్యోగం సాధించడం పట్ల యాపల్ గూడ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 10, 2025

ఆదిలాబాద్: కొనసాగుతున్న అనిశ్చితి..!

image

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ADBలో ఎవరెవరు అధ్యక్షులైతే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 9, 2025

పెరుగనున్న చలి తీవ్రత.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

నవంబర్ 11 నుంచి 19 వరకు తీవ్ర చలి పరిస్థితులు నెలకొనున్నందున ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ADB కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. తెలంగాణ వేదర్‌మన్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం జిల్లాలో 9–12 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు

News November 9, 2025

ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.