News March 18, 2025

యాప్‌లలో బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు: నిర్మల్ ఎస్పీ

image

యాప్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడినా, గేమింగ్‌ యాప్‌లలో గేమ్స్‌ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని నిర్మల్‌ ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లకు అలవాటు పడొద్దని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ప్రోత్సహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చిరిస్తున్నారు.

Similar News

News October 23, 2025

MNCL: నవంబర్‌లో బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన

image

మంచిర్యాల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన నవంబర్‌లో నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 2024-25లో ఎంపిక చేసిన 108 ఇన్స్పైర్ ప్రదర్శనలను 5వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా కాలుష్యం తగ్గించడం అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్‌ను సంప్రదించాలని తెలిపారు.

News October 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 23, 2025

మంచిర్యాల: వైన్స్ దరఖాస్తులు నేటితో పూర్తి

image

గురువారంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. బుధవారం మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో మొత్తం జిల్లాలో మద్యం దుకాణాలకు 949 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 27న షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు.