News March 18, 2025

యాప్‌లలో బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు: నిర్మల్ ఎస్పీ

image

యాప్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడినా, గేమింగ్‌ యాప్‌లలో గేమ్స్‌ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని నిర్మల్‌ ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లకు అలవాటు పడొద్దని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ప్రోత్సహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చిరిస్తున్నారు.

Similar News

News April 23, 2025

రైతు బిడ్డకు 465 మార్కులు

image

గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ, రజిని దంపతుల కుమారుడు రేశ్వంత్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువకుడు ఎంపీసీలో 470కు గానూ 465 మార్కులు సాధించాడు. యువకుడిని రైతులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.

News April 23, 2025

NLG. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కవలలు

image

ఇంటర్ ఫలితాలలో నల్గొండకు చెందిన విద్యార్థినులు( కవలలు) దుర్గాంజలి, అఖిల సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 466/470, 461/470 మార్కులు సాధించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అత్యధిక మార్కులు సాధించినందుకు ఆనందంగా ఉందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు సహకరించిన తల్లిదండ్రుల, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.

News April 23, 2025

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించినట్లు చిత్తూరు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిస్వరన్ తెలిపారు. మంగళవారం ఫీజు కట్టడానికి చివరి రోజు కాగా ఇంటర్ బోర్డు శుక్రవారం వరకు ఫీజు గడువు తేదీని పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

error: Content is protected !!