News September 21, 2024
యారాడ తీరంలో తప్పిన ఘోర ప్రమాదం
యరాడ బీచ్లో విదేశీ పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ఇటలీ దేశానికి చెందిన 8 మంది విదేశీయులను యారాడ సాగర్ తీరని చేరుకొని ఈత చేయ సాగారు. సముద్రపు అలలు వీరిని లోపలికి లాక్కెళ్లిపోవడంతో మిగిలి ఉన్న ఇటలీ దేశస్తులు అక్కడే ఉన్న స్థానికులకు కేకలు వేశారు. సముద్రంలో కోట్టుకుపోతుండగా లైఫ్ గార్డ్స్కు చెందిన సిబ్బంది అక్కడ ఉండడంతో వెంటనే వీరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఏ మాత్రంలేట్ అయినా మొత్తం గల్లంతయ్యేవారు.
Similar News
News November 11, 2024
తలసరి ఆదాయంలో విశాఖనే నంబర్ 1
ఏపీలో జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా తలసరి ఆదాయం లెక్కలు బహిర్గతమయ్యాయి. 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.4.83 లక్షలతో విశాఖ టాప్ ప్లేస్లో ఉంది. రూ.2.10 లక్షలతో అనకాపల్లి 10వ స్థానంలో నిలవగా.. రూ.1.37 లక్షలతో అల్లూరి సీతారామరాజు చివరి స్థానానికి పరిమితమైంది. 2021-22లో కృష్ణా మొదటి స్థానంలో విశాఖ 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
News November 11, 2024
విశాఖ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, స్టీల్ ప్లాంట్ సమస్య, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
News November 11, 2024
ఈ ఏడాది విశాఖలో నేవీ డే వేడుకలు లేనట్లే
ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన విశాఖలో బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం విశాఖలో కాకుండా ఒడిశాలో గల బ్లూ ఫ్లాగ్ బీచ్లో నిర్వహించనున్నట్లు ఈస్ట్రన్ నావల్ కమాండ్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ను డీడీ నేషనల్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.