News March 31, 2025
యాలాల్: బాలుడి కిడ్నాప్‌కు యత్నం..

యాలాల్ మండలం యోన్కెపల్లిలో 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసేందుకు ఓ దుండగుడు యత్నించాడు. గమనించిన స్థానికులు దుండగుడిని నిలదీశారు. అనంతంరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దుండగుడు కొడంగల్ మండలం పర్సాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 4, 2025
లోకేశ్ నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు: అంబటి

AP: మంత్రి లోకేశ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారి గురించి అనుచితంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ‘రెడ్ బుక్ చూసి గుండెపోటు వచ్చిందని లోకేశ్ వ్యాఖ్యానించడం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని లోకేశ్ వికటాట్టహాసం చేస్తున్నారు. అధికార మదంతో ఆయనకు కళ్లు నెత్తికెక్కాయి’ అని అంబటి ఫైర్ అయ్యారు.
News April 4, 2025
మహబూబ్‌నగర్: హోటళ్లలో అధికారుల తనిఖీలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ అధికారంలో తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్ల నుంచి బిర్యానీ శాంపిల్స్ సేకరించి లాబొరేటరీకి పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంపిల్స్‌లో ఏమైనా కల్తీ నిర్ధారణ జరిగితే సదరు హోటళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
News April 4, 2025
SKZR: నేటి నుంచి ఈనెల 20 వరకు పలు రైళ్ల రద్దు

నేటి నుంచి ఈనెల 20 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. బెల్లంపల్లి రేచని రోడ్డు మధ్య మూడో రైల్వే లైన్ పనుల కారణంగా భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్లు మంచిర్యాల వరకే నడపనున్నట్లు పేర్కొంది. మిగతా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా తెలిపింది.