News February 2, 2025

యాలాల: పూజారి కొడుకు బాడీ బిల్డర్

image

జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాత తాండూరు కోటేశ్వర ఆలయ పూజారి శేఖర్ స్వామి తనయుడు అభిషేక్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆయనను సన్మానించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరచి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాన కార్యదర్శి రాములు ఉన్నారు.

Similar News

News December 4, 2025

GHMC మెగా విలీనంపై అడ్డంకులు.. మరో ఏడాది HMDA నిబంధనలే!

image

విశాలమైన GHMC ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనా క్షేత్రస్థాయిలో పాలనా ప్రణాళికకు అడ్డంకులు తప్పడం లేదు. 27 ULBs‌ను విలీనం చేసినప్పటికీ పౌరులకు ఏకరూప నిబంధనలు ఇప్పట్లో అందుబాటులోకి రావు. విలీన ప్రాంతాల్లో ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ 2013 జోనల్ నిబంధనలే ఇంకో ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంక్లిష్టమైన రూల్స్‌ను ఏకీకృతం చేయడంలో అధికారుల జాప్యం కారణంగా కొత్త GHMC, HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఆలస్యం కానుంది.

News December 4, 2025

అమరావతి: బ్లడ్ టెస్టుల పేరుతో భారీగా వసూళ్లు

image

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలు రక్తాన్ని పీల్చినట్లు సామాన్యుల నుంచి డబ్బులు లాగేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగనిర్ధారణ టెస్టుల పేరుతో రక్త పరీక్షలు చేయించాలని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ల్యాబ్‌లకు సిఫార్సు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, అధికారుల తనిఖీలు కరువయ్యాయని వాపోతున్నారు. మీ ఏరియాలో పరిస్థితిపై కామెంట్ చేయండి.

News December 4, 2025

రూ.14,00 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: కలెక్టర్

image

జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.