News February 2, 2025

యాలాల: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

image

యాలాల మండలం పగిడియాల గ్రామంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన చంద్రయ్య, లోకేశ్, బసప్ప, బల్లప్పతో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేయాలని సూచించారు.

Similar News

News November 4, 2025

వరంగల్: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. ఉమ్మడి WGLలో 21 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT

News November 4, 2025

NGKL: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు:DMHO

image

ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్స్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే రవికుమార్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ABAS అటెండెన్స్ అందరూ టైంలో పెట్టాలని సూచించారు. ఆస్పత్రిలో రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని కోరారు.

News November 4, 2025

విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.