News February 2, 2025
యాలాల: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

యాలాల మండలం పగిడియాల గ్రామంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన చంద్రయ్య, లోకేశ్, బసప్ప, బల్లప్పతో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేయాలని సూచించారు.
Similar News
News February 12, 2025
బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
News February 12, 2025
కోనసీమ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు: కలెక్టర్

కోనసీమ జిల్లాలో ఇంతవరకూ బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు గుర్తించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 18 పౌల్ట్రీల్లో 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని, ఎక్కడా వైరస్ ఆనవాళ్లు లేవన్నారు. వారం రోజుల పాటు అంగన్ వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేయాలని చెప్పారు. అయితే తూ.గో, ప.గోలో వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలు చికెన్ తినేందుకు జంకుతున్నారు. దీంతో హోటళ్లు, చికెన్ దుకాణాల్లో గిరాకీ తగ్గింది.
News February 12, 2025
JEEలో సత్తాచాటిన గుంటూరు అమ్మాయి

JEE మెయిన్స్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ సత్తా చాటింది. తొలి విడత పేపర్-1 ఫలితాల్లో 100% మార్కులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నగరానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కిషోర్ చౌదరి, ప్రైవేట్ ఆసుపత్రిలో HODగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమార్తెనే సాయిమనోజ్ఞ. ఇష్టపడి విద్యను అభ్యసించడం కారణంగా 100% మార్కులు సాధించానని హర్షం వ్యక్తం చేస్తుంది.