News February 5, 2025
యాలాల: మృతి చెందిన వ్యక్తి వివరాలు గుర్తింపు!

యాలాల మండలం కాగ్న నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి వివరాలను యాలాల పోలీసులు సేకరించారు. మృతుడు తాండూరులోని సాయిపూర్‌కు చెందిన శ్రీనివాస్(40)గా గుర్తించారు. తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన శ్రీనివాస్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. శ్రీనివాస్ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, మద్యం అలవాటు ఉండటంతో నీటిలో పడి చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News February 13, 2025
అనకాపల్లి: భార్య మృతితో భర్త ఆత్మహత్య

భార్య మృతితో మనస్తాపానికి గురైన ఏ.నాగ శేషు (62) అనకాపల్లి పట్టణం తాకాశివీధిలో బుధవారం తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వారికి వివాహం చేసినట్లు ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 13, 2025
చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
News February 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో మంటల్లో చిక్కుకొని వృద్ధుడి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షికి సమీపంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మహబూబ్ బాషా అనే వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్ బాషా తన పొలం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తన పొలం పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పు అంటుకుంది. తన చేనులోకి మంటలు ఎక్కడ పడతాయో అన్న ఉద్దేశంతో మహబూబ్ బాషా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పొగకు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.