News February 19, 2025

యుడైస్ ప్లస్ వర్క్ షాపుకు విధిగా హాజరుకావాలి: డిఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర మేనేజ్మెంట్ పాఠశాలల ప్రిన్సిపల్స్, కంప్యూటర్ ఆపరేటర్లు సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామ పరిధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యుడైస్ ప్లస్ వర్క్‌షాప్‌కు తప్పకుండా హాజరు కావాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు.హాజరు కాని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Similar News

News March 23, 2025

కడ్తాల్: అందాల పోటీలకు పైసలు ఎక్కడివి: సర్పంచుల సంఘం

image

గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం అందాల పోటీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి ప్రశ్నించారు. శనివారం కడ్తాల్‌లో మాట్లాడుతూ.. సొంత నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.

News March 23, 2025

నేడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం

image

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంగర్‌లో ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్నారని చెప్పారు. కావున జిల్లా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

News March 23, 2025

పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్‌లో అంగన్వాడీ కేంద్రాల భవనాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మరమ్మతు పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటి వరకూ చేపట్టిన అభివృద్ధి, ఇతర వసతుల కల్పనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!