News July 18, 2024
యునివర్సిటీ లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పులివెందులకు చెందిన ఓ విద్యార్థిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని SKUలో MBA రెండో సంవత్సరం చదువుతోంది. వసతి గృహంలో ఉరివేసుకుంటున్న ఆమెను చూసి తోటి విద్యార్థినులు కేకలు వేయడంతో ప్లంబింగ్ పనులు చేస్తున్న సిబ్బంది కాపాడారు. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 3, 2025
కడప రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?

కడప రిమ్స్లో అందే సేవల విషయంలో పేషెంట్లు, వారి వెంట వెళ్లే కుటుంబసభ్యులు నిరుత్సాహం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవల స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కుటుంబీకులు చేతుల మీద ఎత్తుకెళ్లారు. అలాగే పేషెంట్లను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్లను చెత్తను తరలించడానికి సిబ్బంది ఉపయోగించిన ఫొటోలు కూడా బయటికి రావడంతో విమర్శలు వస్తున్నాయి. అక్కడి సేవలు, మీరు ఎదుర్కొన్న సమస్యలను కామెంట్ చేయండి.
News December 3, 2025
కడప: నవంబరులో తగ్గిన మద్యం ఆదాయం

కడప జిల్లాలో మద్యం ఆదాయం నవంబరులో భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠ స్థాయిలో రూ.83.38 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.101.31 కోట్లు, మేలో రూ.98.90 కోట్లు, జూన్లో రూ.97.31 కోట్లు, జూలైలో రూ.96.47 కోట్లు, ఆగస్ట్లో రూ.96.42 కోట్లు, సెప్టెంబర్లో రూ.93.36 కోట్లు, అక్టోబర్లో రూ.93.44 కోట్లు, నవంబర్లో రూ.83.38 కోట్లు ఆదాయం వచ్చింది.
News December 3, 2025
కడప జిల్లాలో 60,411 హెక్టార్లలో పంటల సాగు.!

కడప జిల్లాలో రబీ పంట సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 60,411 హెక్టార్లలో(43.21%) పంటల సాగు జరిగింది. కేసీ కెనాల్ నీటి విడుదలపై స్పష్టత కరువై వరి 526 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వరి, గోధుమ, కొర్ర, రాగి, జొన్న తదితర ధాన్యం పంటలు 2,086 హెక్టార్లలో సాగు చేశారు. పప్పు దినుసులు 56,106 హెక్టార్లలో, నూనె గింజలు 1,654 హెక్టార్లలో, వాణిజ్య పంటలు 16 హెక్టార్లలో సాగయ్యాయి.


