News February 18, 2025

యునెస్కో అంతర్జాతీయ సదస్సుకు పెద్దపల్లి బిడ్డ

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమెర గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సిల్వర్ జూబ్లీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో యునెస్కో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సహా 400 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.

Similar News

News March 23, 2025

IPL: మన కుర్రాడికి ముంబై ఛాన్స్ ఇచ్చేనా!

image

నేడు ముంబైvs చెన్నై మ్యాచ్ జరగనుంది. కాకినాడకు చెందిన పెన్మత్స సత్యనారాయణరాజు ముంబై టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుది జట్టులో మన కుర్రాడికి చోటు దక్కుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. ఫాస్ట్ బౌలర్ అయిన సత్యనారాయణ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి అందరి ప్రశంసలు పొందారు. ఐపీఎల్‌లో ముంబై ఒక్క ఛాన్స్ ఇస్తే నితీశ్‌లా చెలరేగుతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి మీరెమంటారు?

News March 23, 2025

NLG: వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో యువకుడి మృతి

image

నేరేడిగొమ్ము వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో బోడుప్పల్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. HYDకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఉదయం కృష్ణా తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 

News March 23, 2025

WNP: చికిత్స పొందుతూ వివాహిత మృతి

image

ఆత్మకూర్ మండలంలో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. బాలకృష్ణాపుర్‌కి చెందిన రాధ(34) గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పిని భరించలేక ఈనెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులపాటు చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది.

error: Content is protected !!