News March 23, 2025
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
Similar News
News March 30, 2025
చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయండి: కలెక్టర్

రోజురోజుకూ ఎండ వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయా శాఖల పరంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం హీట్ వేవ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
News March 29, 2025
ఈ ఉగాది, రంజాన్ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ఎస్పీ

జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరము ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లిం సోదర, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకలశుభాలు కలగాలని పేర్కొన్నారు.
News March 29, 2025
తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాలు తిరిగి, తాగునీటి సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కారంపై నివేదికను పంపించాలి అధికారులను ఆదేశించారు.