News April 15, 2025

యువకుడిని కాపాడిన తిరుమల పోలీసులు

image

తిరుమలలో ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని పోలీసులు కాపాడారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నానికి చెందిన మునిసాత్విక్ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తిరుమలలోని కళ్యాణి చౌల్ట్రీలో 3 అంతస్తుల మిద్దెపై నుంచి దూకేస్తున్నట్లు హైదరాబాద్‌లోని చెల్లికి చెప్పాడు. వెంటనే సాత్విక్ చెల్లి తిరుమల పోలీసులకు చెప్పడంతో 10 నిమిషాల్లోనే వారు అక్కడికి వెళ్లి యువకుడిని కాపాడారు.

Similar News

News October 28, 2025

కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

image

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

News October 28, 2025

ఎర్ర కాలువ పటిష్టతకు చర్యలు: మంత్రి కందుల

image

మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఎర్ర కాలువ పరివాహక గ్రామాల రైతులకు, ప్రజలకు తాజా పరిస్థితిని క్రమం తప్పకుండా వెల్లడించాలన్నారు.

News October 28, 2025

ఇంటర్వ్యూతోనే NIRDPRలో ఉద్యోగాలు..

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: http://career.nirdpr.in