News February 22, 2025

యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

image

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.

Similar News

News November 24, 2025

బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

image

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

News November 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.

News November 24, 2025

VKB: జిల్లా రాజకీయాల్లో యువ గర్జన.. పాత లీడర్లకు సవాల్!

image

వికారాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల హీట్ మొదలైంది. ఈసారి పంచాయతీల్లో యువత పెద్ద ఎత్తున రంగంలోకి రావడంతో రాజకీయ వాతావరణం మారిపోయింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలు చేస్తూ, గ్రామ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పాత నేతలకు యువత నేరుగా సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికల్లో “యువ శక్తి vs పాత నేతలు” పోటీ హాట్‌గా మారనుంది. యువ శక్తే ఈసారి గేమ్‌చేంజర్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది.