News March 6, 2025
యువకుడి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు: ఎస్ఐ

కొయ్యూరు మండలం బకులూరు పంచాయతీ నెల్లిపూడి గ్రామానికి చెందిన పొట్టిక రాము(24) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖాళీగా తిరుగుతున్నాడని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన రాము ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజుబాబు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీ.కిషోర్ వర్మ బుధవారం తెలిపారు.
Similar News
News December 16, 2025
భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్‌లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News December 16, 2025
తిరుపతి, చిత్తూరు జిల్లాల TDP కొత్త బాస్‌లు వీరే.!

తిరుపతి, చిత్తూరు జిల్లాల TDP జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం షణ్ముగం, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వనబాక లక్ష్మీని నియమించినట్లు తెలుస్తోంది. నేతలు, నాయకులు నిర్ణయం మేరకు ఈ ఎంపిక జరిగిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News December 16, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ శబరీష్

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న డోర్నకల్, కురవి, సీరోల్, కొత్తగూడ, గంగారం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీలు(5), సీఐలు(15), ఎస్సైలు(50) సుమారు 1000 మంది సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటారని SP పేర్కొన్నారు.


