News April 9, 2025
యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు

ధనశ్రీ గ్రామంలో యువకుడు మహమ్మద్ అబ్బాస్ అలీ (25) హత్య కేసులో నిందితులు ఖలీల్ షా, మమ్మద్ బిస్త్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీల్ తన తల్లిని వేధిస్తున్నాడని అబ్బాస్ హెచ్చరించడంతో అతన్ని కత్తులతో హత్య చేశారు. అడ్డుగా వచ్చిన షేక్ అక్బర్ అలీపై బీర్ బాటిల్‌తో దాడి చేశారన్నారు. తర్వాత ఓ బైక్‌ను అపహరించి పారిపోయారు. జూన్ 8న నిందితులు పట్టుబడ్డారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
Similar News
News November 14, 2025
ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన BBC

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రముఖ మీడియా సంస్థ <<18245964>>BBC<<>> ఆయనకు క్షమాపణలు చెప్పింది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొంది. అయితే పరువునష్టం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించింది. తాము ఉద్దేశపూర్వకంగా వీడియో ఎడిట్ చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ డాక్యుమెంటరీని తిరిగి ప్రసారం చేసే ఉద్దేశం తమకు లేదని బీబీసీ న్యాయవాది తెలిపారు.
News November 14, 2025
TTD ఈవోను ప్రశ్నించిన సిట్ ఆధికారులు..?

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఏర్పాటైన సీబీఐ సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రెండు రోజులు క్రితం కలిసినట్లు సమాచారం. నెయ్యి టెండర్ల విధివిధానాలు మార్చినప్పుడు ఈవోగా ఆయనే ఉండటంతో దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. టెండర్ల గురించి ముందు అధికారులను అడిగితే తెలుస్తుందని మాజీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. దీంతో సింఘాల్‌ను కలిసి ఈ అంశాలపై చర్చినట్లు సమాచారం.
News November 14, 2025
జగిత్యాల: 394 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో మొత్తం 436 వరి కొనుగోలు కేంద్రాలకు 394 కేంద్రాలు ఇదివరకే ప్రారంభం అయ్యాయని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. 56 కోట్ల రూపాయల విలువగల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 28 కోట్ల రూపాయల విలువ వరకు రైతుల వివరాలను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 7 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రతి మండలానికి, క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు.


