News January 28, 2025
యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించింది: భాష్యం

మంత్రి లోకేశ్ యువగళం పాదయాత్రతో కొత్త చరిత్రను సృష్టించారని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగళం పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి లోకేశ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో యువతకు లోకేశ్ ఆదర్శంగా నిలిచారన్నారు.
Similar News
News February 14, 2025
అలిపిరి నడక మార్గంలో చిరుత కదలికలు

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దీంతో భద్రత నడుమ భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
News February 14, 2025
అనంత: ప్రణతికి డాక్టరేట్

అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.
News February 14, 2025
ఏలూరులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

ఏలూరులో ఈనెల 11న టూటౌన్ సీఐ వైవీ రమణ ఎన్ ఆర్ పేటలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ బ్యూటీ యునిసెక్స్ బ్యూటీ పార్లర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులు నాగార్జున, అతని భార్య శివదుర్గ, దివ్య, భాను ప్రకాశ్, నరేంద్రపై కేసు నమోదు చేశారు. నాగార్జున, శివదుర్గ, దివ్యలను కోర్టులో హాజరుపరచగా..14 రోజులు రిమాండ్ విధించారు. భాను ప్రకాశ్, నరేంద్ర పరారీలో ఉన్నారు.