News October 6, 2024

యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి: అనిత

image

మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు (రామ)రాజుని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అనిత కోరారు.

Similar News

News October 6, 2024

గుంటూరు: కానిస్టేబుల్ అని బెదిరించి లైంగిక దాడి

image

పోలీసు కానిస్టేబుల్‌ అని ఓ విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట CI వీరయ్య వివరాల మేరకు.. ఇద్దరూ ప్రేమికులు బస్టాండ్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో ఓ వ్యక్తి వారిని ఆపాడు. తాను కానిస్టేబుల్‌ని అని.. ఎక్కడికి వెళ్తున్నారని వారిని బెదిరించి స్టేషన్‌కు రావాలన్నాడు. అనంతరం ఆ విద్యార్థినిని వాహనంపై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

News October 5, 2024

జగన్ అన్ని హద్దులు దాటేశారు: పుల్లారావు

image

దేవుడి మీదే కాదు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉందని MLA పుల్లారావు తప్పుబట్టారు. చిలకలూరిపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ వివాదంలో ఇప్పటికే జగన్ అన్ని హద్దులు దాటేశారన్నారు. చివరకు దేశాన్నే ప్రశ్నించే దుస్సాహసం చేశారన్నారు. రాష్ట్రం, దేశం న్యాయ వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేని వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించారు.

News October 5, 2024

తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా: పెమ్మసాని

image

తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-2047 యాక్షన్ ప్లాన్, తెనాలి పట్టణ అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి అధికారులతో చర్చించారు.