News October 6, 2024
యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి: అనిత
మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు (రామ)రాజుని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అనిత కోరారు.
Similar News
News November 11, 2024
ప్రత్తిపాడు: జూద శిబిరంపై పోలీసుల దాడి
ప్రత్తిపాడులోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. CI శ్రీనివాసరావు వివరాల మేరకు.. రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి 38మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.96,300 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News November 11, 2024
ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు.
News November 10, 2024
కేసుల నుంచి తప్పించుకోడానికి జగన్ ప్రయత్నం: MLA జీవీ
ఐదేళ్లపాటు శాంతిభద్రతలను రౌడీ మూకల చేతుల్లో పెట్టిన ఫ్యాక్షన్ నాయకుడు జగన్ అని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో ఉన్మాదం, విషం నింపి ఒక తరం భవిష్యత్తునే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. తల్లి, చెల్లిపై కూడా తప్పుడు పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్ అని తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.