News January 30, 2025

యువతకు ఉపాధి కల్పించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో ఉపాధి కల్పన కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌ఛేంజే ఆఫ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు.

Similar News

News November 20, 2025

వనపర్తిలో ఈనెల 22న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 22న 10.30 గంటలకు వనపర్తిలోని రామాలయం దగ్గర ఉన్న పీఎంకేకే సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.వెంకటేశ్వర రాజు తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లు, SSC/ITI/డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి హైదరాబాద్/వనపర్తిలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని, వివరాలకు 9848776371ను సంప్రదించాలని కోరారు.

News November 20, 2025

కృష్ణా: ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి లభించింది. పలు మండలాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, ఏఓ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.