News February 22, 2025

యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యం: శ్రీధర్ బాబు

image

టాస్క్ & శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఉచిత డేటా ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. డిమాండ్‌లో ఉన్న టెక్ నైపుణ్యాలు,ఉద్యోగ అవకాశాలతో తెలంగాణ యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 23, 2025

హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు జీహెచ్ఎంసీ టెండర్‌లకు ఆహ్వానించింది.

News February 23, 2025

ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

image

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News February 23, 2025

కృష్ణా: పోలవరం లాకుల వద్ద ఇద్దరు గల్లంతు

image

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!