News March 13, 2025
యువతలో ఎఐ నైపుణ్యాకు మైక్రో సాఫ్ట్తో కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయస్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్తో ఎపి ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గురువారం విజయవాడ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు.
Similar News
News September 14, 2025
నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
News September 14, 2025
KMR: అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

కారు నెంబర్ ప్లేట్ మార్చి దొంగతనాలకు పాల్పడిన ఒక అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. SP రాజేష్ చంద్ర వివరాలిలా..కామారెడ్డి వాసి శివారెడ్డి తాళం వేసిన ఇంటికి దొంగలు తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఇవాళ రాజస్థాన్ వాసి హన్సరాజ్ మీనాకు అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు SP వెల్లడించారు
News September 14, 2025
త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు.