News October 1, 2024

యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్

image

యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.

Similar News

News November 6, 2025

పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.

News November 6, 2025

నేడు పాలమూరులో అభినందన బైక్ ర్యాలీ

image

పాలమూరుకు యూజీడీ కోసం రూ.821 కోట్లు, తాగునీటి పైప్‌లైన్ కోసం రూ.221 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం ఉదయం 10:30 గంటలకు అభినందన బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ క్యాంపు కార్యాలయం శ్రీనివాస్ కాలనీ నుంచి క్లాక్ టవర్ వరకు సాగుతుందని డీసీసీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సిరాజ్ ఖాద్రి తెలిపారు.

News November 5, 2025

నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.