News April 13, 2025
యువతికి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్న యువకుడి అరెస్టు

సోషల్ మీడియా ద్వారా ఎలమంచిలి రాంనగర్‌కు చెందిన యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎలమంచిలి సీఐ ధనంజయరావు శనివారం తెలిపారు. ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన బొండా చండీశ్వరరావు ఇన్స్టాగ్రామ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటోలు, అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు చెప్పారు. దీనిపై యువతి ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.
Similar News
News November 1, 2025
తిరుపతి SVCCలో ఈ నెల 4న జాబ్ మేళా

తిరుపతి SVCCలో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాధం శనివారం తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, PG చేసిన వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ లింక్‌లో https://naipunyam.ap.gov.in/user-registration తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 3 ఆఖరి తేదీ అన్నారు.
News November 1, 2025
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘కల్కి’

ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)-2025 వైభవంగా జరిగింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా, ‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్‌గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్‌గా కృతి సనన్, బెస్ట్ డైరెక్టర్‌గా కబీర్‌ఖాన్‌కు అవార్డులు దక్కాయి.
News November 1, 2025
ఖమ్మం: పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

పీఎఫ్ఎంఎస్ నిధులు రూ.4 లక్షల పైగా దుర్వినియోగం చేసిన ఆరోపణలపై బోనకల్ మండలం రాపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటరమణను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రావినూతల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆమె ప్రత్యేక అధికారులకు తెలియకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఎంపీవో విచారణ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా కలెక్టర్ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


