News February 5, 2025

యువతిని బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడు అరెస్ట్

image

నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియాతో మాట్లాడారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. నిందితుడికి చెందిన రూ.కోటి 81 లక్షల విలువ గల ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా నిందితుడి ఫోన్‌లో ఎటువంటి వీడియోలు లభ్యం కాలేదన్నారు.

Similar News

News March 14, 2025

15 నుంచి ఒంటిపూట బడులు

image

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.

News March 14, 2025

నిర్మల్: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి అన్ని పాఠశాల యాజమాన్యాలు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్మల్ డీఈఓ రామారావు గురువారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ 15వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు ఉదయం 8మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News March 14, 2025

గోపాలమిత్ర కుటుంబీకులకు లక్ష ఆర్థిక సహాయం

image

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోపాలమిత్ర సభ్యులు ఈరోజు మృతుడి కుటుంబీకులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు పల్లెపాటి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, మహిపాల్ రెడ్డి, రామస్వామి, సత్తార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు.

error: Content is protected !!